పంచమి…. పరమ పవిత్రమైన రోజు.. ఈ సందర్భంగా ది. 30/1/2020 గురువారం సాయంత్రం 4.30 గంటలకు మన వల్లభ గణపతి మందిరం లో సరస్వతీ అమ్మవారికి పూజాదికాలు నిర్వహించబడును. తదనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు పుస్తకములు, పెన్నులూ పంచిపెట్టబడును. మన భాగ్య విశేషం ఏమంటే మన గురుదేవులు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అందరూ విచ్చేసి కార్యక్రమం తిలకించి అమ్మవారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము. శ్రీ మాత్రే నమః Share on: WhatsApp
శ్రీ వల్లభ గణపతి 2019 నవరాతి మహోత్సవములు Share on: WhatsApp
మన వల్లభ గణపతి గుళ్లో ఇవాళ పుట్టిన కపిల గోవు….. 15 రోజులలో ఇది రెండవది. చాలా ఆనందం. గోమాత్రే నమః 🙏🙏🙏🙏🙏 Share on: WhatsApp
ఇవాళ మన గుడికి విచ్చేసిన శ్రీ అప్పాస్వామి వారు…. వారు మహా ఉపాసకులు. నిజంగానే సిద్దపురుషులు. జూమ్ చేసి చూడండి. వారి వర్ఛస్సు… ప్రాంగణం అంతా తిరిగారు. వారి స్వీయ అనుభవాలు తెలియచేశారు. మన గుడి తరఫున సన్మానం చేసాము. నిజంగా ఇటువంటి వారిని కలుసుకునే భాగ్యం కల్పించిన మన గురుదేవులకు శత సహస్ర ప్రణామాలు. ఈ సాయంత్రం ఒక అద్భుత సాయంత్రం….. అంతేనండీ. శ్రీ అప్పాస్వామి వారు. వీరు అనంతపురం లో వుంటారు. మన గుడి చూడాలని ఇవాళ విచ్చేసారు. గుడి మొత్తం
దేశం కోసం, ధర్మం కోసం గురువుగారు తలపెట్టిన “చండీహోమం”…. ఈ నెల 28/7/19 ఆదివారం ఉదయం 8.00 గంటలకు మన వల్లభ గణపతి ఆలయంలో జరుగును. అందరూ హాజరై అమ్మవారి, గణపతి స్వామి వారి ఆశీస్సులు పొందవలసినదిగా కోరుచున్నాము. అందరికీ ఇదే మా ఆహ్వానం…🙏🙏🙏 Share on: WhatsApp
గణపతి, గురువుగారి అనుగ్రహం… శ్రీ సూర్యనారాయణ మూర్తి ఇవాళ పొద్దున్నే విజృంభించి వచ్చారు రాజమండ్రి లో. హోమం చేస్తున్నంత సేపూ ఆయన విజృంభణ అలా కొనసాగుతూనే ఉంది. పూర్ణాహుతి టైం కి చిన్నగా మబ్బు పట్టింది. పెద్దదయ్యింది. అంతే. పూర్ణాహుతి అయ్యింది. వెంటనే విపరీతంగా వర్షం. ఒక 5 నిమిషాల పాటు. ఆహా… స్వామి అనుగ్రహించారు అని అందరం సంబరపడ్డాం. వర్షం తగ్గిన తర్వాత అందరం బయలుదేరాం. ఇక్కడే అసలైన ట్విస్ట్. గుడి నుంచి బయలుదేరి కళ్యాణ్ నగర్ ఆర్చ్ (ముప్పావు కిలోమీటర్) దాకా
20/7/19 శనివారం… పంచముఖ ఆంజనేయునికి అభిషేకం. ఉదయం 7.00 గంటలకు. Share on: WhatsApp
19/7/19 శుక్రవారం… గణపతి స్వామి వారికి అభిషేకం. ఉదయం 6.30 గంటలకు. Share on: WhatsApp
16/7/19 మంగళవారం… “గురుపౌర్ణమి” సందర్భంగా మన గణపతి ఆలయం సుప్రతిష్టులై ఉన్న జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారికి పంచామృతాదులతో అభిషేకం, పూజాదికాలు ఉదయం 8.00 గంటలకు Share on: WhatsApp
మన గణపతి ఆలయంలో ని గోశాల లో నేడు తెల్లవారుజామున పుట్టిన ఆవు. Share on: WhatsApp