Temple History – మందిరము చరిత్ర

History of temple ( yearwise)

2015 Pranapratista

గంగకు మరోరూపమైన గోదావరి భూమిపైకి రావడానికి ప్రధానకారకుడు గణపతి. అంతేకాక గణపతి సహస్రంలో “గౌతమీతీర సంచారిణే నమః, గౌతమీతీర్థదాయకాయ నమః” అని చెప్పినట్లు గోదావరీ తీరంలో సదా సంచరించే గణపతి ఆ తీరాన్నే తన అవతరణకు ఎంచుకుని రాజమహేంద్రవరంలో గల కొంతమూరు గ్రామంలో అవతరించాడు.  గోదావరీ తీరంలో ఎందరో గణపతులు ఉన్నా కామేశ్వరీ కామేశ్వరుల కలయికతో ఉద్భవించిన వల్లభగణపతి శక్తి అమ్మవారి సంకల్పంతో షణ్ముఖుని ద్వారా ఇక్కడ ఆవిర్భవించింది.

ఈ మందిర నిర్మాణానికి నిర్ణయించిన స్థలమునకు నిగమాగమ శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు వచ్చి ధ్యానదృష్టితో దర్శించి “ఇది మహాక్షేత్రమౌతంది. ఈ మందిరం ఆచంద్రార్కం నెలకొనిఉంటుంద”ని చెప్పారు. మహాగణపతి అవతరణకు యోగ్యమైన శిల్పమును నిర్మించడానికి శిల్పకళానిధి శ్రీ గణపతి స్థపతి గారు బాధ్యతను చేపట్టారు. మహాగణపతితోపాటు, 15 గణపతుల శిల్పములు కూడా కాంచీపురంలో కామాక్షీదేవి సన్నిధిలో నవమాసాలు ఆకృతిని సంపాదించుకుని 10వ నెలలో ఆలయంలో ప్రతిష్థించేందుకు చేరుకున్నారు.

గణపతి “చతుర్లక్ష జప ప్రీతః” కనుక తన్మంత్ర జపసంఖ్య చతుర్లక్షాధికంగా చేసిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, వారి ఆత్మీయులలో కొందరు వల్లభగణపతి మంత్రాన్ని కొంత కాలమునుండి దీక్షగా జపించి ఋత్విక్కులతో పాటుగా అష్టద్రవ్యములతోనూ, సహస్రమోదకములతోనూ తద్దశాంశ హోమములలోను, తర్పణలలోనూ ఫాల్గొని లోకకళ్యాణార్థం వల్లభగణపతి పాదాలకు వారి మంత్రశక్తిని ధారపోసారు. వివిధ జపములతో, మంత్రములతో, హోమములతో, అభిషేకములతో పాటుగా తత్త్వ న్యాస, కళా న్యాసములు చేసి దేవతాశక్తిని ఈ దేవాలయంలో, ప్రతిమలలో విశేష రీతిలో పెంపొందింపజేసారు. చక్కని శిల్పకళతో యజ్ఞాలద్వారా ప్రవేశించిన 96 కళలతో  మహత్తేజఃస్పూర్తితో విరాజిల్లుతున్న ఆరడుగుల మూడున్నర అంగుళాల బృహద్గణేశమూర్తి తొమ్మిది అంగుళాల పీఠంపై నెలకొని దర్శించినవారికి దివ్యానుభూతిని కలుగజేస్తున్నాడు.

Chinatamani Dwipam

శివునకు కైలాసం, విష్ణువుకు వైకుంఠం, అమ్మవారికి మణిద్వీపం వలె గణేశపరమాత్మ సకలవిభూతులతో నెలకొన్న లోకం “చింతామణిద్వీపం”.

చెఱకు సముద్రం మధ్యలో నవరత్నమయమై-చింతామణులతో కూడుకున్న ద్వీపం. ఆ ద్వీపం మధ్యలో కల్పవృక్షంక్రింద సింహాసనం పైన మహాగణపతి యంత్రం. దాని మధ్యలో ఆరురేకులతోనున్న పద్మం. దాని కర్ణికయందు త్రికోణం మధ్యభాగంలో – గర్భాలయంలో పది చేతులతో, పంచమిథునదేవతాశక్తులతో, శ్రీ వల్లభాదేవితోనున్న మహాగణపతి నెలకొని ఉంటాడు.

ఈ త్రికోణానికి నాలుగువైపులా-

ముందుభాగంలో (తూర్పు దిక్కున) మారేడుచెట్టు క్రింద లక్ష్మీనారాయణులు….

దక్షిణదిక్కులో మర్రిచెట్టునీడలో పార్వతీపరమేశ్వరులు….

పడమరదిక్కులో పిప్ప్ల చెట్టు క్రింద రతీమన్మథులు….

ఉత్తరదిక్కులో ప్రియంగు వృక్ష్పౌ ఛాయలో భూదేవితోకూడిన వరాహస్వామి భక్తులను అనుగ్రహిస్తుంటారు.

యంత్రమునౌ ఆరుకోణములలో క్రమంగా…

తూర్పు : ఋద్ధి(సిద్ధి) ఆమోద శక్తులు

ఆగ్నేయం: స్మృద్ధి, ప్రమోద శక్తులు

ఈశాన్యం: కాంతి, సుముఖ శక్తులు

పశ్చిమం: మదనావతి, దుర్ముఖ శక్తులు

నైఋతి : మదద్రవా, (అ)విఘ్న శక్తులు

వాయవ్యం: ద్రావిణీ, విఘ్నకర్త శక్తులు

ఈ శక్తులన్నీ పాశము, అంకుశము, అభయ, వరద హస్తాలతో-అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటారు. వారితోకూడిన అమ్మవారిశక్తులు ఒకచేత్తో పద్మాన్ని, మరొకచేత్తొ స్వామివారిని ఆలింగణం చేసుకుని ఉంటారు.

ఈ షట్కోణానికి ఇరువైపుల శంఖనిధి, పద్మనిధి తమ ప్రియులతో కూడి ఉంటారు.

మూర్తీభవించిన సామవేద పురుషుడు వేదస్వరాలతో స్వామివారిని సేవించుకుంటుంటాడు.

Srirama Mandiram

 Coming Soon..

Rama Parivar

Coming Soon

Panchamukha Anjaneya Temple

వందే వానరనారసింహఖగరాట్ క్రోడాశ్వవక్త్రాన్వితం

నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా,

హస్తాబ్జైరసిఖేటపుస్తకసుధాకుమ్భాంకుశాద్రిం హలం

ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారివీరాపహమ్.

 

 

తూర్పు – వానర వదనం

దక్షిణం – నరసింహ వదనం

పడమర – గరుత్మంతుని వదనం

ఉత్తరం – వరాహ వదనం

ఊర్ధ్వం – హయగ్రీవ వదనం

 

ప్రతివదనం కి 3 నేత్రములు చొప్పున మొత్తం 15 నేత్రములు. 10 చేతులు. వాటిలో క్రమంగా కత్తి, త్రిశూలం, ఖట్వాంగం, పాశం, అంకుశం, పర్వతం, గద, వృక్షం, కమండలం, నాగలి ధరించి ఉంటాడు.

Comments are closed.