గణపతి, గురువుగారి అనుగ్రహం…
శ్రీ సూర్యనారాయణ మూర్తి ఇవాళ పొద్దున్నే విజృంభించి వచ్చారు రాజమండ్రి లో. హోమం చేస్తున్నంత సేపూ ఆయన విజృంభణ అలా కొనసాగుతూనే ఉంది.
పూర్ణాహుతి టైం కి చిన్నగా మబ్బు పట్టింది. పెద్దదయ్యింది. అంతే. పూర్ణాహుతి అయ్యింది. వెంటనే విపరీతంగా వర్షం. ఒక 5 నిమిషాల పాటు.
ఆహా… స్వామి అనుగ్రహించారు అని అందరం సంబరపడ్డాం.
వర్షం తగ్గిన తర్వాత అందరం బయలుదేరాం.
ఇక్కడే అసలైన ట్విస్ట్.
గుడి నుంచి బయలుదేరి కళ్యాణ్ నగర్ ఆర్చ్ (ముప్పావు కిలోమీటర్) దాకా వచ్చేసరికి అక్కడ ఒక్క చుక్క వర్షం లేదు. రోడ్లు డ్రై గా ఉన్నాయి.
పడిన వర్షం అంతా గుడి చుట్టుప్రక్కల మాత్రమే. అప్పుడు అనుకున్నాము… ఇవాళ స్వామి సంతోషించారు. ఆ ఆనందాన్ని ఇలా పంచుకున్నారు.. అని.
స్వామి అనుగ్రహానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి అండీ?
ఇదంతా స్వామి అనుగ్రహం, గురువుగారి ఆశీస్సులు ఫలితం మాత్రమేనండీ.
ఈ అద్భుతాన్ని మీతో పంచుకుంటూ…..
Comments are closed.