దేశ సౌభాగ్యం కోసం, దేశాభివృద్ధి కోసం, శత్రుపీడా నివారణార్ధం, హిందూ ధర్మ పరిరక్షణార్ధం, మన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం రావడం కోసం గురువుగారు చండీహోమం చేయమని చెప్పారు.
వారి మాట అనుసరించి మన వల్లభ గణపతి గుళ్లో ఈ ఆదివారం 17/3/19 న ఉదయం 8.00 గంటలకు, వారి ఆశీర్వచనం తో, “చండీహోమం” నిర్వహించుచున్నాము.
దేశం కోసం, ధర్మం కోసం జరిపే ఈ యాగానికి అందరికీ ఇదే మా ఆహ్వానం.
మరొక విషయం..
అదే సమయంలో, గురువుగారి ఆజ్ఞ మేరకు హనుమాన్ చాలీసా పారాయణ, శ్రీ రామరక్ష స్తోత్ర పారాయణ విశేషంగా జరుగును.
రండి. మన ధర్మం కోసం. దేశం కోసం ఆలోచించే మంచి నాయకుడి చేతులో దేశం ఉండాలని, దేశం ఇంకా అభివృద్ధి సాధించాలి అనే సంకల్పంతో తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము.
Comments are closed.